హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండ్లపల్లి చెరువు వద్ద వ్యర్ధాలు

PLD: నకరికల్లు మండలం గుండ్లపల్లి చెరువు కట్ట ప్రవేశ ద్వారం వద్ద జూదం వంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు కుప్పలుగా పడి ఉండటమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను కాపాడాలని కోరుతున్నారు.