హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన సేవలకు వాలంటీర్లకు అవకాశం

HYD: నగర సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం-2026 సందర్భంగా వాలంటీర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. భక్తులకు సహాయం చేయడం, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో సహకరించడం, పోలీసులతో సమన్వయం చేసుకోవడంలో వాలంటీర్లు పాల్గొనవచ్చని అధికారులు ఎక్స్ వేదికగా తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకోవాలని కోరారు.