హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెన్సీ నోట్లతో వినాయకుడు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం 17వ వార్డులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా పట్టణ సీనియర్ రాజకీయ నాయకులు జి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నోట్లతో అలంకరించిన వినాయకుని దర్శించుకోవడానికి కాలనీ వాసులు బారులు తీరారు. ప్రతి ఏడాది వినూత్నంగా వినాయక చవితి జరుపుకుంటున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు