హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పిడుగుపాటుకు గొర్రెలు మృతి

ప్రకాశం: కనిగిరి మండలం నేలటూరి గొల్లపల్లిలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గత కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో నేలటూరి గొల్లపల్లి గ్రామానికి చెందిన డబ్బు కొట్టు ఐతయ్యకు చెందిన నాలుగు గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.