హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడు జింకలపై రెండు చిరుతలు దాడి

ATP: తాటిచెర్లలో గగుర్లు పుట్టించే ఘటన చోటుచేసుకుంది. రైతు నరసింహారెడ్డి తన టమాటా తోట చుట్టూ వేసిన ఫెన్సింగ్‌లోకి ప్రవేశించిన ఏడు జింకలపై రెండు చిరుతలు దాడి చేసి చంపేశాయి. ఫెన్సింగ్ వల్ల జింకలు బయటకు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనతో స్థానికులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించాలని కోరుతున్నారు.