హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యాసంస్థలో ఘనంగా వినాయక పూజ

RR: షాద్‌నగర్‌లోని ఓ విద్యాసంస్థలో వినాయక పూజ ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేత నెల్లి శ్రీ వర్ధన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గత 25 ఏళ్లుగా మట్టి విగ్రహాలను పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకు, సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఆలపించిన వినాయక భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి.