హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

16న రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ రాక

AKP: ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె. ఎస్. జోహార్ ఈనెల 16న అనకాపల్లికి రానున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎస్సీ సంఘాలు, దళిత నాయకులు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.