హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'MPTC, ZPTC ఎన్నికలపై 16న సమావేశం'

ASR: MPTC, ZPTC ఎన్నికల నేపథ్యంలో అరకులోయ మండలంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించేందుకు ఈ నెల 16న సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు మండల పరిషత్ ఆఫీసులో సమావేశం జరుగుతుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధ్యక్షులు తప్పనిసరిగా హాజరై సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని MPDO వీసం ప్రసాద్ కోరారు. ఎన్నికల ఏర్పాట్లపై పార్టీల అభిప్రాయాలను సేకరిస్తారు.