హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

16 ఏళ్లుగా రోడ్డు కోసం నిరీక్షణ

KKD: పెదపూడి మండలం చింతపల్లిలోని దళిత కాలనీకి వెళ్లే రహదారి పరిస్థితిపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా రాకపోకలు సాగించడం అత్యంత దుర్భరంగా మారుతోందని స్థానికులు వాపోతున్నారు. గత 16 ఏళ్లుగా ఈ రహదారిని ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థుడు మందపల్లి సురేశ్ తెలిపారు.