హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఫిరంగిపురంలో స్కూటీ చోరీ

GNTR: ఫిరంగిపురం రసూల్‌పేటలో శనివారం అర్ధరాత్రి స్కూటీ చోరీకి గురైంది. స్థానికుడు సుభాని ఇంటి ముందు పార్క్ చేసిన AP 39 QF 5973 నంబరు గల స్కూటీని గుర్తుతెలియని ఇద్దరు యువకులు అపహరించారు. ఉదయం వాహనం కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమీపంలోని సీసీ కెమెరాల్లో నిందితులు స్కూటీని నెట్టుకుంటూ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.