HYD: సికింద్రాబాద్ న్యూబోయిగూడలోని గాంధీ మెట్రో స్టేషన్ మెట్ల పక్కన ఫుట్‌పాత్‌పై గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. సుమారు 40-45 ఏళ్ల వయసున్న ఆమె భిక్షాటన చేసుకునే వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. కాళ్లకు గాయాలున్న మహిళ ఆకుపచ్చ రంగు నైటీ ధరించి ఉంది. పెట్రోలింగ్‌లో ఉన్న గాంధీనగర్ పోలీస్ కానిస్టేబుల్ నాగరాజు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
తెలంగాణ
గాంధీ మెట్రో స్టేషన్ వద్ద మహిళ మృతి


