హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో రూ.30 లక్షలతో మౌలిక వసతులు

KNR: నగరాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 12వ డివిజన్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.30 లక్షలతో చేపట్టనున్న హెచ్‌డీపీఈ పైప్‌లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో, సత్వరమే పూర్తిచేసి తాగునీటి సమస్యను తీర్చాలని అధికారులను ఆదేశించారు.