హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరంతర తాగునీటి సరఫరాపై సమీక్ష

VSP: విశాఖలో నిరంతర తాగునీటి సరఫరా చేయడమే లక్ష్యంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఎండాడ రిజర్వాయర్‌ను పరిశీలించారు. నగరంలో నీటి లభ్యత, రిజర్వాయర్ల సామర్థ్యంపై సమీక్ష నిర్వహించారు. 135 బల్క్, 8100కి పైగా సెమీ-బల్క్ కనెక్షన్ల ద్వారా రోజూ లక్ష కిలోలీటర్ల నీరు సరఫరా అవుతున్నట్లు ఆయన తెలిపారు.