హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజానగరంలో భారీ గణపతి

E.G: రాజానగరంలో ప్రముఖంగా నిలిచిన భారీ గణేశ్ మండపాన్ని MLA బత్తుల బలరామకృష్ణ దర్శించుకున్నారు. జిల్లాలోనే పెద్ద మండపంగా పేరొందిన ఈ ప్రాంగణాన్ని నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించి, ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, NDA కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.