హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించిన ఈటల

HYD: నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతిని ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఐక్యతకు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు వినాయక ఉత్సవాలు దోహదపడతాయని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా దీవించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.