హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపేటలో మహిళా ఓటర్లదే పైచేయి..!

కోనసీమ: మండపేట పురపాలక సంఘంలోని 36 వార్డుల్లో మొత్తం 49,059 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 25,820 మంది మహిళలు, 23,239 మంది పురుషులు ఉండగా, పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,581 మంది అధికంగా ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీ ఓటర్లు 27,344 మందితో అత్యధికంగా ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 5,334, ఓసీ ఓటర్లు 16,045, ఎస్టీ ఓటర్లు 336 మంది ఉన్నారు.