హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుగ్గిలమ్మ ఆలయం వద్ద పోలీసుల గట్టి బందోబస్తు

ATP: రాయదుర్గం పట్టణంలో రేపు జరగనున్న దుగ్గిలమ్మ జాతర వేడుకలు సందర్భంగా ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కోసం అర్బన్ సీఐ దేవానంద్ ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు ప్రశాంతంగా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.