హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకుడికి ప్రత్యేక పూజలు..!

అన్నమయ్య: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ.. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబాలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి పాల్గొని ప్రజలకు సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. పోలీసు కుటుంబాల సమిష్టి వేడుకలతో ఆత్మీయ అనుబంధం మరింత బలపడింది.