హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా జమ్మికుంట-సుల్తానాబాద్ ప్రధాన రహదారి

PDPL: ఓదెల మండలం పోత్కపల్లి అంగడి గేటు సమీపంలో జమ్మికుంట సుల్తానాబాద్ ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. భారీ వర్షాలకు గ్రామంలోని ప్రధాన రహదారి బురదమయం గుంతలమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వర్షానికి భారీగా వరద నీరు చేరడంతో ఇబ్బందికరంగా మారింది. అధికారులు నాయకులు స్పందించి గుంతలు పూడ్చి నూతన రోడ్డు నిర్మించాలని కోరారు.