హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అధ్వానంగా కొణతాలపల్లి వెళ్లే రహదారి..!

NTR: వీరులపాడు మండలం పల్లంపల్లి నుంచి కొణతాలపల్లి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గుంతలు, దెబ్బతిన్న రహదారితో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.