కడప: 1 టౌన్ పరిధిలో ఎస్సై అమర్‌నాథ్ రెడ్డి పలు గణపతి మండపాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని సూచించారు. పోలీసుల నిబంధనలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించాలి'


