హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన

CTR: సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 8.30 గం.లకు తిరుమలలోని VIP క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌కు చేరుకుంటారు. అక్కడ ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సులకు జెండా ఊపి ప్రారంభిస్తారు. SV మ్యూజియం వద్ద శ్రీవేంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభించి, TTD అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.