హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దమండ్యంలో ఘనంగా వినాయక చవితి

అన్నమయ్య: పెద్దమండ్యం మండలంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెడ్డివారిపల్లిలో RVP యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 11 అడుగుల దుర్గామాతా సమేత గణనాథుడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. రేపు రాత్రి తవళం టేజల్ శివాన్షిక సౌజన్యంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.