హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అధిక శబ్దాలతో ఆరోగ్యానికి ముప్పు'

CTR: గణపతి నవరాత్రి వేడుకలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు ముగిసే వరకు పలు ప్రాంతాలు డీజే మోతలతో దద్దరిల్లనున్నాయి. అయితే పరిమితికి మించిన శబ్దాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక శబ్దం వల్ల చెవులతో పాటు గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వేడుకల్లో భక్తి పాటలు, సంప్రదాయ వాయిద్యాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.