తూ.గో జిల్లాలో వినాయక చవితి సందడి మొదలైంది. గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్లు, వీధుల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేశారు. మట్టి వినాయక విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. పండగ సందర్భంగా మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా.. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పండగ సందడి.. కొలువుదీరిన గణపయ్యలు..!


