ఏలూరు: జిల్లా సైకిల్ పోలో విద్యార్థులు రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల పోటీల్లో సత్తా చాటారు. ఈనెల 13, 14 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలోని డీపీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పోటీల్లో 12 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. మహిళల విభాగంలో ఏలూరు జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించగా, పురుషుల జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలను పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సైకిల్ పోలోలో విద్యార్థుల సత్తా..!


