ప్రకాశం: గిద్దలూరులో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వార్డుల వారీగా నీటి సమస్యలు, చెడిపోయిన బోర్లు, అడుగంటిన బోర్ల వివరాలను అధికారులతో చర్చించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి ఎద్దడిపై ముందస్తు చర్యలు


