హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దూండి వినాయకుడిని దర్శించిన ఆదిమూలం

TPT: నారాయణవనం మండల కేంద్రంలోని శ్రీ దూండి వినాయక స్వామివారిని, మెయిన్ బజార్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాన్ని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దర్శించుకున్నారు. ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించి మహాప్రసాదం అందజేశారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.