నెల్లూరు: మనుబోలు మండలం పిడూరు మిట్ట గ్రామంలో సోమవారం మద్యం మత్తులో దాడి జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వలిపి అమర్నాథ్, రాపూరు అంకయ్య, లోక్నాథ్ మధ్య పాత గొడవలు ఉన్నాయి. అంకయ్య, లోక్నాథ్ మద్యం తాగారు. ఇంటికి వెళ్తున్న తనపై వారిద్దరూ దాడి చేశారని అమర్నాథ్ ఆరోపించారు. గాయాలు కావడంతో గూడూరులోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పాత గొడవలు.. బీరు బాటిల్‌తో దాడి


