హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచకప్‌ ఫైనల్.. చరిత్ర సృష్టించిన ధీరజ్‌

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత స్టార్, ఏపీ యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో పురుషుల రికర్వ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో అతను షూటాఫ్‌లో నకానిషి (జపాన్‌)పై విజయం సాధించాడు. కాగా, ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ నుంచి మహిళల విభాగంలో డోలా బెనర్జీ (2007) మాత్రమే రికర్వ్ పసిడి నెగ్గింది.