అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని కొత్తపేట రోడ్డులో కార్తికేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి'


