హైదరాబాద్: 28°C
వార్తలు

చిరు వ్యాపారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

AP: చిరు వ్యాపారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తోపుడు బండ్లు, చిన్న దుకాణాలు, పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించే వ్యాపారులకు ఇకపై బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డులు అందించనున్నారు. వ్యాపార అవసరాలకు కనిష్ఠంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.30 వేల వరకు ఈ కార్డుల ద్వారా వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులకు ఈ ప్రయోజనం అందనుంది.