హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి'

NDL: వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షరాన్ సూచించారు. ఊరేగింపులకు పోలీసుల అనుమతి తీసుకుని, నిర్ణీత మార్గంలోనే నిర్వహించాలని తెలిపారు. డీజేలు, అధిక శబ్దానికి దూరంగా ఉండి, నిమజ్జనంలో భద్రతా జాగ్రత్తలు పాటించాలని కోరారు. వదంతులను నమ్మవద్దని, అత్యవసర సమయంలో 112కు ఫోన్ చేయాలని సూచించారు.