హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి వేడుకల్లో సుభాన్ బాషా

అన్నమయ్య: నగరంలోని 30వ డివిజన్ రవి థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని వికాస్ విద్యా సంస్థల అధినేత సుభాన్ బాషా సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.