హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేశభక్తి ఉట్టిపడేలా వినాయకుడి ఆకృతి

తూ.గో: కాకినాడలోని గొల్లప్రోలు పట్టణం ఈబీసీ కాలనీలో వినాయక చవితి సందర్భంగా వినూత్నంగా వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేశారు. కోలా వీరబాబు మట్టి అక్షింతలతో ప్రత్యేక ఆకృతిలో వినాయకుడిని రూపొందించారు. దేశభక్తి ఉట్టిపడేలా రూపొందించిన ఈ వినాయకుడి రూపం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. మట్టి అక్షింతలతో చేసిన ఈ ప్రతిమ పర్యావరణ పరిరక్షణకు చక్కని సందేశాన్ని అందిస్తోందన్నారు.