కృష్ణా: విజయవాడ కొత్తపేట పరిధిలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఏడేళ్ల చిన్నారి సురక్షితంగా వారి చెంతకు చేరింది. సాయిరాం థియేటర్ ప్రాంతం నుంచి నడుచుకుంటూ చిట్టినగర్ మోతి మసీదు వద్దకు చేరిన చిన్నారిని స్థానికులు గుర్తించి 112కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి సీసీ కెమెరాల ఆధారంగా ఆచూకీ గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ కెమెరాలతో కథ సుఖాంతం..!


