హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొగల్తూరులో ఆకట్టుకుంటున్న వినాయకుడు

ELR: మొగల్తూరు పడమటి పాలెం రామాలయం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వరిపిండి, బెల్లం, మరమరాలతో విగ్రహాన్ని రూపొందించారు. కమిటీ యువకులు మూడు రోజుల పాటు శ్రమించి తయారు చేసిన ఈ విగ్రహానికి సుమారు రూ.14 వేలు ఖర్చయింది. పర్యావరణహిత గణనాథుడిని రూపొందించిన యువకులను అభినందించారు.