VSP: జిల్లాలో వినాయకచవితి సందర్భంగా ఆశీలుమెట్ట వద్ద ఉన్న శ్రీ సంపత్ వినాయక ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సంపత్ వినాయకుడిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సంపత్ వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు


