హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక పూజలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్

సత్యసాయి: జిల్లా కలెక్టర్ బంగ్లాలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ కుటుంబ సభ్యులతో మట్టి వినాయక పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నీరు కలుషితమవుతుందని తెలిపారు. అనంతరం జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.