హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌ భిన్నమైన ప్లేయర్: డేల్ స్టెయిన్

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ ప్రత్యేకమైన ఆటగాడని కితాబిచ్చాడు. 'భారత క్రికెట్‌కు సూర్యవంశీ అద్భుతమైన నిధిలాంటోడు. సచిన్, కోహ్లీ కంటే ఇంకా విధ్వంసకరం. ఇలాగే కొనసాగితే ఆ ఇద్దరిని అధిగమించి పెద్ద స్టార్ అవుతాడు. అతడిని మేనేజ్‌మెంట్ మంచిగా చూసుకుంటే గొప్ప ప్రతిఫలం అందిస్తాడు' అని పేర్కొన్నాడు.