హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినాయక చవితి వేళ చిరుజల్లులు

NTR: విజయవాడలో వినాయక చవితి పండుగ వేళ నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గణేష్ చతుర్థి సంబరాల్లో భాగంగా భక్తులు నిమగ్నమై ఉండగా, ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వర్షం కారణంగా ఉక్కపోత తగ్గి నగరం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు, భక్తులు ఉపశమనం పొందారు. పండుగ పూట వరుణ దేవుడి ఆశీస్సులు లభించాయని నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు.