KMM: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైరా మున్సిపల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ పిలుపునిచ్చారు. సోమవారం వైరా పట్టణంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని భక్తులకు ఉచితంగా విగ్రహాలను అందజేశారు. ప్రజలు తమ బాధ్యతగా పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని, కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్


