RR: సాగర్ రింగ్‌రోడ్ ఫ్లైఓవర్ కింద ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు అమ్మవారి బంగారు ఆభరణాలతో పాటు హుండీలోని నగదును అపహరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ఛైర్మన్ ఆలయానికి వచ్చేసరికి ఇనుప గ్రిల్స్ గేటుకు వేసిన తాళం పగులగొట్టి కనిపించింది.
తెలంగాణ
రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ


