హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం

నెల్లూరు: జిల్లాలో సోమవారం ఉదయం వాతావరణం మారింది. రాపూరు మండలం పెంచలకోనలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వర్షం కురవడంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ ప్రాంగణం, పుర వీధులన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. కొన్నిరోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.