హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చల్లపల్లిలో చిన్నారి బాలలచే చవితి వేడుకలు

కృష్ణా: చల్లపల్లి పార్వతమ్మ తోటలో చిన్ని చిన్ని బాలలు వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. చెక్క ముక్కలతో పందిరి వేసి, మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేసి ఇళ్లలో పూచిన పూలతో అలంకరించారు. అగరబత్తులు వెలిగించి అరటిపండ్లు, లడ్డూ సమర్పించి పూజ చేశారు. చిన్నారి బాలల భక్తిభావాన్ని పెద్దలు ప్రోత్సహించి అభినందించారు.