AKP: టీటీడీకి చెందిన నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అంకురార్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు 10 రోజులు పాటు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు తెలిపారు. దీనిలో భాగంగా కావిడిని మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పండ్లు పూలు కొబ్బరికాయలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం


