కాకినాడ: ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట గ్రామస్తులు, భక్తులు పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే


