హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్ని గ్రామాలలో వినాయక విగ్రహాలకు పూజలు

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించుకుంటున్నారు. మండలంలోని రోటిగూడాలో ఉన్న గీత ఆశ్రమంలో ప్రధాన గురువు మౌన స్వామి ఆధ్వర్యంలో నిర్వాహకులు వినాయకునికి పూజలు నిర్వహించారు. జన్నారం, కలమడుగు, మొర్రిగూడ, మురిమడుగు, కిష్టాపూర్, పోన్కల్ గ్రామాలలో ప్రజలు వారి ఇళ్లల్లో వినాయక విగ్రహాలకు పూజలు చేశారు.