హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో ఏకశిలా గణపతికి పూజలు

MDK: శివంపేట మండల పరిధిలోని సికింద్రాపూర్ గుట్టపై వెలసిన ఏకశిలా శ్రీ విఘ్నేశ్వర స్వామికి సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు, అష్టోత్తర నామార్చనలు జరిపారు. నయనమనోహరంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.