SKLM: పోలాకి మండలం మబగాంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. వినాయక మండపాన్ని సందర్శించిన నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడు ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. సిద్ధి వినాయకుని ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి వేడుకలలో ఎమ్మెల్యే


